– రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షల విరాళం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూ.10 లక్షల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. తన సొంత బ్యానర్ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా, సందీప్ రెడ్డి వంగాలు శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేని భారీ వర్షాల కారణంగా ఎంతోమంది నష్టపోయారని, బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా ఈ విరాళం అందజేసినట్లు సమాచారం. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు సందీప్ రెడ్డి. టాలీవుడ్‌లో హిట్ పడగానే బాలీవుడ్‌కు మకాం మార్చి అక్కడాడా కబీర్ సింగ్, యానిమాల్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా ’స్పిరిట్’ అనౌన్స్ చేసి టాక్ అఫ్ ది ఇంటర్నేషనల్‌గా మారారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


