డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

– ‘తెలంగాణ రైజింగ్’లో ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ
– కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ స్ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన
– ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 20:  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ చేసి… డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్ వేర్ గా మాత్రమే కాకుండా… ఓ ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా మార్చుకుంటున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రణాళికలను వివ‌రించారు. న్యూఢిల్లీ భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా శుక్రవారం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ‌ర్ ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసైలెన్స్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు.  పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి, ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, , ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూ భారతి లాంటి విప్లవాత్మక సంస్కరణలు డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణ బ్రాండ్ ను సుస్థిరం చేస్తాయన్న‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతానికో లేదా వర్గానికో పరిమితం చేయకుండా అందరికీ చేరువ చేసేలా ‘ఏజెంటిక్ ఏఐ’ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. టెక్నాలజీని కేవలం గవర్నెన్స్ కు మాత్రమే పరిమితం చేయకుండా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర రంగాలకూ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తెలంగాణ ఒక టాలెంట్‌పూల్‌

తెలంగాణాలో ఏఐ పరిశోధలు, ఆవిష్కరణలకు ప్రభావశీలమైన టాలెంట్ పూల్ ఉందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.శుక్రవారం నాడు ఆయన ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ లో స్వీడెన్ వాణిజ్య ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.కృత్రిమ మేథ వెల్లువ వల్ల ఎదురయ్యే సవాళ్లను, అది తీసుకువచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం ముందే సంసిద్ధమైంది.దానికి తగ్గట్టుగా సాఫ్ట్ వేర్ నిపుణుల నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు ప్రారంభించామ‌న్నారు. ఏఐ విస్తృతితో ఉద్యోగ విధుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. అందుకు అవసరమైన సన్నధను మొదలు పెట్టింది మా ప్రభుత్వమేన‌న్నారు. ఏఐ పరిశోధన కేంద్రాలు, అప్లికేషన్లు, సేవల వల్ల కొత్త ఉద్యోగాలు ఫుట్టుకొస్తాయి. యువత దీనిని అందిపుచ్చుకోవాలి.
యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు ఏఐ అపారమైన అవకాశాలను సృష్టిస్తుంద‌న్నారు. స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ అనేది రెండేళ్లుగా మేం మంత్రంలా జపిస్తున్నాం. ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఏఐ వినియోగం వల్ల లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. దుర్వినియోగానికి ద్వారాలను మూసివేస్తుంది. ఇందుకు అవసరమైన అప్లికేషన్లను రూపొందించడం, నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు గ్లోబల్ టెక్ కంపెనీలు ముందుకు రావాలి.కృత్రిమ మేథ ఫలాలను ప్రజలందరి వద్దకు చేర్చేందుకు ప్రతి గ్రామానికి ఇంర్నెట్ కనెక్టివిటీని అందించే బృహత్తర యజ్ణం ఇప్పటికే మొదలైంది. టీ- ఫైబర్ ప్రతి గ్రామాన్ని ప్రంపచంతో కనెక్ట్ చేసేందుకు రెండేళ్లుగా శ్రమిస్తోంది. ఏఐ ఓ గేమ్ ఛేంజర్. దాన్ని మచ్ఛిక చేసుకోవాలి. మన నైపుణ్యాలకు పదును పెట్టుకుని దానిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి.పెట్టుబడులకు తెలంగాణా స్వర్గధామం లాంటిది. కొత్తదనానికి రాష్ట్రం ఎప్పుడూ స్వాగతం పలుకుతూ ఉంటోంది. దీనికి అనుకూలమైన ఎకోసిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. నిరంతర విద్యుత్తు సరఫరా, స్థిరమైన విధానాలు అమలు చేస్తున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *