డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

– సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామక ష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబ్కేదర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ రాజీవ్ చావ్లా (రిటైర్డ్ ఐఎఎస్) అధ్యక్షతన సమావేశం జరిగింది. రెవెన్యూ కార్యదర్శి లోకేశ్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హన్మంతు, ఇతర సీనియర్ అధికారులతో సమీక్ష చేశారు. సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీలోగా డిసిఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎన్ ఐసి అధికారుల సహకారంతో సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 10, 877 గ్రామాల్లో డిసిఎస్ సర్వే చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. సీజనల్ డిజిటల్ క్రాప్ సర్వే వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపకరిస్తుందని, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జిఎస్ డిపి) గణాంకాలకు ఈ సర్వే ఉపయుక్తంగా ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. యుపి, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ పూర్తి అయిందని కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ చావ్లా తెలిపారు. అదే తరహాలో రాష్ట్రంలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ సంచాలకుడు గోపి ఇప్పటివరకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను ఉన్నతాధికారులకు వివరించారు. సమావేశంలో కార్యదర్శులు లోకేశ్ కుమార్, సురేంద్రమోహన్, రాజీవ్ గాంధీ హన్మంతు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *