పాత బస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా?

– దౌర్జన్యాలు, దొంగతనాలకి అనుమతిచ్చారా
– అధికారులు, పోలీసులపై దాడి చేస్తున్నా చర్యలు తీసుకోరేం
– మీ చేతగానితనానికి నిదర్శనం ఇదే
– కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేదు
– పాత బస్తీనే అభివృద్ధి చేయలేరు.. ఆదిలాబాద్ అభివృద్ధి ఓ జోక్
– సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులపై దాడులకు తెగబడ్డ మజ్లిస్ నేతలను అరెస్టు చేయకపోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు కూల్చినచోటే గంటల వ్యవధిలో మళ్లీ నిర్మాణాలు చేపట్టినా చేష్టలుడిగి చూడడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం గారూ.. పాత బస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? వాళ్లు ఎవరిపైనైనా దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా.. పాత బస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూల్‌ను అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. హైకోర్టు సమీపంలోని మురళీధర్ ఆలయాన్ని సోమవారం సాయంత్రం సందర్శించిన బండి సంజjáYT అక్కడి బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని మమతా బెనర్జీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బంగ్లా చొరబాటుదారులతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయనీయకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. దేశ భక్తులకు, దేశ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించి గెలిపించాలని బెంగాలీ కుటుంబాలను అభ్యర్ధించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, పుల్లారావు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్, లంకల దీపక్ రెడ్డి తదితరులతో కలిసి బండి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో దాదాపు 60 వేల మంది బెంగాలీలు నివసిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడున్న వాళ్ల బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి బీజేపీకి ఓటేయించాలని కోరుతున్నామన్నారు. బీజేపీకి ఓటేయిస్తామని హైదరాబాద్‌లోని బెంగాలీ సమాజమంతా హామీ ఇచ్చిందన్నారు. బెంగాల్‌లో ఉండలేక చాలామంది బెంగాలీలు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారన్నారు. అయితే పాత బస్తీలోనూ బెంగాలీ కుటుంబాలు ఉండలేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 కంటే ముందే యూపీఏ పాలనలో బంగ్లాదేశ్, ఇతర దేశాల నుండి అక్రమంగా వేలమంది హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలకులు రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చి రెడ్ కార్పెట్ పరిచారు. చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలని బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. బీజేపీకి ఓటేసి దేశ భద్రతలో భాగస్వాములు కావాలని బెంగాల్ ప్రజలను కోరుతున్నానన్నారు. పాత బస్తీలో కొంతమంది బెంగాలీ కుటుంబాల పిల్లలను మజ్లిస్ గూండాలు డ్రగ్స్ ఎరవేసి లోబర్చుకునే ప్రయత్నం చేశారన్నారు. మజ్లిస్ గూండాల అరాచకాలకు పోలీసులూ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు.నిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని, మజ్లిస్‌కు రేవంత్ రెడ్డి పూర్తిగా దాసోహమయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎంగా, హోం మంత్రిగా ఉన్నా ఏమీ చేయలేని అసమర్ధుడిగా మిగిలారన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. పాతబస్తీని అభివ్రుద్ధి చేయడం చేతగాని సీఎం బాసరకు పోయి ఆదిలాబాద్‌ను వేల కోట్లతో అభివృద్ధి చేస్తాననడం పెద్ద జోక్. ఉపన్యాసాలకే రేవంత్ రెడ్డి పరిమితమయ్యారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా గ్రామాలను ఎందుకు అబివృద్ధి చేయడం లేదని నిలదీశారు. పాత బస్తీలో అధికారులు, పోలీసులపై జరుగుతున్న దాడులపై సీఎం వెంటనే స్పందించాలన్నారు. లేనిపక్షంలో పాత బస్తీలో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదముందని బండి హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *