రఫేల్‌ ‌కూలిందా లేదా?

  • కేంద్రం స్ప‌ష్టం చేయాలి
  • ర‌ఫేల్ విమానాలు కూలాయ‌ని సీడీఎస్ చెప్పారు క‌దా!
  • రాహుల్‌ను దేశ‌వ్య‌తిరేకి అన్నారు
  • మ‌రి సీడీఎస్‌ను కూడా అంటారా?
  • ఆపరేషన్‌ ‌సింధూర్‌ను ఎప్పుడూ తప్పుపట్టలేదు
  • మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

యుద్ధంలో ర‌ఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయా, అన్న‌ ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని అన్నారు.  శనివారం దిల్లీ వేదికగా మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడారు. ఆపరేషన్‌లో ర‌ఫేల్యుద్ధ విమానం కూలిపోయిందని సీడీఎస్‌ అనిల్‌ ‌చౌహన్‌ ‌మాత్రం స్పష్టం చేశార‌న్నారు. బ్లూమ్‌బర్గ్ ‌ఛానెల్‌లో భారత సీడీఎస్‌ ఈ ‌విషయాన్ని వెల్లడించారని గుర్తుచేశారు. సీడీఎస్‌ ‌వ్యాఖ్యలపై ఏం చెప్తారు. రఫేల్‌ ‌విమానాలు కూలాయని రాహుల్‌ ‌చెబితే దేశ వ్యతిరేకి అన్నారు. మ‌రి సీడీఎస్‌ను దేశ వ్యతిరేకి అంటారా? పాకిస్థాన్‌ ‌ఫైటర్‌ ‌జెట్స్ ఎన్ని కూలాయో కూడా స్పష్టం చేయాలి.  భారత ప్రభుత్వం ఇకనైనా దీన్ని నిరాకరించడం మానుకోవాలని, ఇదే విషయాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి గుర్తుచేశారు.  42 ఫైటర్‌ ‌విమానాలు మంజూరైతే మన వద్ద కేవలం 31 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

చైనా ,పాకిస్థాన్‌తో ముప్పు నేపథ్యంలో భారత్‌ ‌భద్రతను పటిష్టం చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కోరారు. ఆపరేషన్‌ ‌సింధూర్‌లో భారత ఎయిర్‌ఫోర్స్ ‌విజయాలపై తాము గర్విస్తున్నామని కొనియాడారు. మన సైనికులు అద్భుతమైన ఆపరేషన్‌ ‌నిర్వహించారని, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారని ప్రశంసించారు.కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ఎలా ట్వీట్‌ ‌చేశారని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్‌ ‌విమానాలు, ఆయుధాలను అందించడంలో ఆలస్యం అవుతున్న‌దని ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ ‌చెప్పడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

తేలికపాటి యుద్ధ విమానాలను స్లపై చేయడంలో హెచ్‌ఏఎల్‌ ఆలస్యం చేస్తోందని,  అత్యవసరంగా ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఆపరేషన్‌, ఆర్‌ అం‌డ్‌డీ విభాగాల్లోకి బెస్ట్ ‌బ్రెయిన్స్ ‌రావడం లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకత పాటించాలని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కోరారు. వాయుసేనకు ఫైటర్‌ ‌జెట్స్, ఆయుధాలు సరైన సమయానికి అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆపరేషన్‌ ‌సింధూర్‌లో భారత్‌ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సరిపడా యుద్ధ విమానాలు లేవు. ఇది దేశానికి మంచిది కాదు. ఆపరేషన్‌ ‌సింధూర్‌పై కాంగ్రెస్‌ ‌రాజకీయం చేయడం లేదు. యుద్ధ విషయాలు ప్రపంచానికి బహిరంగంగానే చెప్పాలి. విజయాలతో పాటు లోటుపాట్లను కూడా ప్రజలకు చెప్పాలని ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *