ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

– తెలంగాణ క్రీడా కార్య‌క్ర‌మాలు దేశానికి ఆద‌ర్శం
– మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి
– ప‌లువురు క్రీడాకారుల‌కు న‌గ‌దు పుర‌స్కారాలు
– ఘ‌నంగా జాతీయ క్రీడా దినోత్స‌వం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:  భారత క్రీడలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో  క్రీడా సమాజం ముందుకెళ్లాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్ర‌వారం జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అద్భుతమైన క్రీడా ప్రతిభతో వరుసగా మూడు ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన ధ్యాన్చంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని  ప్రతి క్రీడాకారుడు ఒలంపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందుకొని  తెలంగాణలో ఒలంపిక్స్ క్రీడలు నిర్వహించడమే కాదు ఒలంపిక్స్ ప‌త‌కాలు సాధించడంలో కూడా రాష్ట్ర క్రీడాకారులు ముందుండాలన్నారు.  నూతన క్రీడా విధానం ఇస్తున్న ప్రోత్సాహంతో  క్రీడాకారులు తమ ప్రతిభను  చాటి రాష్ట్రానికి వన్నె తేవాలని ఆయన కోరారు.  స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా తెలంగాణలో తొమ్మిది రోజులపాటు అత్యంత ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు నిర్వహించి  క్రీడా స్ఫూర్తిని చాటుతున్న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయన్నారు.  ఒక ఏడాది కాలంలోనే అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించి క్రీడా విధానం ప్రకటించి  క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ను క్రీడా ప్రముఖులు ప్రశంసిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా  రాష్ట్రంలోనే  విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, హైదరాబాద్ నగరంలోనే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో క్రీడా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయని తెలిపారు.
జాతీయ‌ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఇటీవల వివిధ క్రీడాంశాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు పురస్కారాలతో సన్మానం చేశారు.  41 మంది క్రీడాకారులకు రూ.కోటి 29 లక్షల నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వరల్డ్ ఆర్చరీ అండర్- 21  బంగారు పతకం సాధించిన చికితా తానిపర్తి కి రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని,  పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిని శృతికి రూ.5లక్షల  నగదు పురస్కారాన్ని, షూటింగ్ క్రీడాకారిని ఇషా సింగ్ కు  రూ.4లక్షల నగదు పురస్కారాన్ని పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిని తుడి శ్రీ చందనకు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని ఇండియన్ క్రికెట్ టీం ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని,  జూలై 20 25 సౌత్ కొరియా జీ చైన్ లో  జరిగిన 20వ ఆసియన్ రోలర్ స్కేటింగ్ సీనియర్ ఛాంపియన్ షిప్ లో పత కాలు సాధించిన  తేజేష్, కాంతిశ్రీ, శ్రియా మురళి,ఎండూరు ఆకాంక్ష, చలంచర్ల జోహిత్, జియా జయేష్ పటేల్, రక్షిత్ మురళి ఎండూరు సంచిత చౌదరి, ప్రతీక్ లకు రూ.5లక్షల చొప్పున‌ నగదు పురస్కారాలను అందజేశారు. ఓల్డ్ కెన్యాలో జరిగిన జూనియర్ వరల్డ్ రోల్ బాల్ పోటీలో నెగ్గిన ఎం శ్రీశాంకు రూ.5 లక్షలు,  రూరల్ స్కేటింగ్ లో మాకన్ సౌరవ్ సింగ్, ఆర్ కావ్య శ్రీలకు రూ.4 లక్షల చొప్పున నగదు పురస్కారాలను మోక్షిత్ రామ్ రెడ్డికి రూ.2 లక్షల నగదు పురస్కారాన్ని, ఉమెన్స్ సాఫ్ట్ బాల్ ఆసియా కప్ లో పాల్గొన్న ప్రవల్లికకు రూ.2లక్షలు, రోలర్ స్కేటింగ్ క్రీడాకారిని నయన శ్రీ కి రూ.75 వేల పురస్కారం, షూటింగ్ క్రీడాకారుడు లీలా ప్రసాద్ రాజుకు రూ.75 వేలు నగదు పురస్కారం, షూటింగ్ క్రీడాకారిని కర్ణికకు రూ.50 వేల నగదు పురస్కారం,  చెస్ క్రీడాకారులు శివంశికకు రూ.50 వేల నగదు పురస్కారం, ఆకాశకు రూ.75 వేల నగదు పురస్కారం అందజేశారు.

పారా క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు

పారా క్రీడాకారులకు కూడా పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పారా టైక్వాండో క్రీడాకారుడు గౌతమ్ యాదవ్ కు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని, పారా త్రోబాల్ క్రీడాకారిని భాగ్యకు రూ.2లక్షల, పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి విజయ దీపికకు రూ.75 వేల, పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారుని కి రూ.50 ,వేల, పారా టైక్వాండో క్రీడాకారుడు కే శివకు రూ.4 లక్షల. పారా అథ్లెటిక్స్ క్రీడాకారిణి లోకేశ్వరికి రూ.3 లక్షల, టైక్వాండో  క్రీడాకారిణి  కృష్ణవేణికి రూ.3 లక్షల, టైక్వాండో క్రీడాకారుడు ఎం.లింగప్పకు 25 వేల, కరాటే క్రీడాకారుడు సాయి ప్రభాత్ కు రూ.75 వేల నగదు పురస్కారాలను మంత్రి అందజేశారు.

గురు వందనం ప్రారంభం

క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న కోచ్‌లకు ఆపదలో ఆపన్న హస్తం అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూపొందించిన గురు వందనం బీమా  పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా ఇటీవల వివిధ పథకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దిన పలువురు కోచ్‌లను ఈ సందర్భంగా సన్మానించారు.  పి రామకృష్ణ కయా కింగ్ కానోయింగ్ కోచ్,ఎం ప్రవీణ్ కుమార్ పవర్ లిఫ్టింగ్ కోచ్, నితేష్వరి దేవి  కోచ్, రవికుమార్ హ్యాండ్ బాల్ కోచ్,ఖదీర్ రోలర్ ఐస్ కేటింగ్ కోచ్, ఎం శ్రీనివాస్ అథ్లెటిక్ కోచ్, స్కేటింగ్ కోచ్ అర్జున అవార్డు గ్రహీత , అనుప్ కుమార్ యామలను ఈ సందర్భంగా సన్మానించారు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ అధికారులను సిబ్బంది పలువురుని ఈ సందర్భంగా సన్మానించారు.  వివిధ క్రీడా కార్యక్రమాల్లో స్పోర్ట్స్ అథారిటీ సమన్వయం ఆకారం అందజేసిన ఫ్యూచర్ ఒలంపియన్స్ సంస్థకు హైదరాబాద్ రన్నర్స్ కు సెలబ్రేషన్ మేకర్స్ సంస్థ ప్రతినిధులను క్రీడా శాఖ మంత్రి అభినందించారు.  కార్యక్రమంలో  స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోని బాలాదేవి,  తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి,కోశాధికారి సతీష్ గౌడ్,  వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు
స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు కోచులు, సిబ్బంది,  క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *