బాలీవుడ్ అగ్ర నటుడు ధర్మేంద్ర కన్నుమూత

– శోక సంద్రంలో సినీ ప్రపంచం

– ప్ర‌ధాని మోదీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము సంతాపం
– ఒక శ‌కం ముగిసింది: ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జో్హార్‌

ముంబై, నవంబర్‌ 24: బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌ సహా పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆరు దశాబ్దాల సినిమా జీవితంలో అనేక హిట్‌లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర, డిసెంబరు 25న విడుదల కానున్న ‘ఇక్కీస్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఆయన చనిపోయినట్లు వచ్చిన పుకార్లను ధర్మేంద్ర స్వయంగా ఖండిరచినప్పటికీ ఈసారి వచ్చిన వార్త నిజం కావడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ధర్మేంద్ర కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే సోమవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు విల్లే పార్లే శ్మశాన వాటికకకు తరలించారు. అగ్రహీరోలు, దర్శకులు, ప్రముఖ నటీనటులు ధర్మేంద్ర భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ధర్మక, నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. ఒక శకం ముగిసింది.. మెగాస్టార్‌ గొప్ప అందగాడు.. ఇండియన్‌ సినిమా లెజెండ్‌ వన్‌ అండ్‌ ఓన్లీ ధర్మేంద్రజీ మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం అని పేర్కొన్నారు.

1935లో జననం.. సినీ ప్రస్థానం

డిసెంబర్‌ 8న జన్మించిన ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్‌ క్రిషన్‌ దేవోల్‌. కొద్దిరోజుల్లో 90వ జన్మదినం రానుండగా ఆయన ఈ ప్రపంచం నుంచి మరలిపోయారు. 1954లో ప్రకాష్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. 1980లో బాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమమాలినిని రెండో వివాహం చేసుకున్నారు. ఆరుగురు సంతానం ఉన్నారు. ఆయన నటనకు అనేక అవార్డులు వచ్చాయి. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది. రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో బికనీర్‌ నుంచి బీజేపీ ఎంపీగా గెలపొందారు. 1960లో దిల్‌ బీ తేరా హమ్‌ బీ తేరే సినిమాతో తెరంగేట్రం చేశారు. షోలే, ధర్మవీర్‌, చుప్కే చుప్కే, మేరా గావ్‌.. మేరా దేశ్‌, డ్రీమ్‌ గర్ల్‌ వంటి చిత్రాలు బాక్పాఫీస్‌ వద్ద హిట్‌ అయ్యాయి. దాపు 300 చిత్రాల్లో నటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page