యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఈనెల 16 నుండి జనవరి 14 వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ ఈవో వెంకటరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 4.30 గంటల నుండి 5 గంటల వరకు ఆలయ ముఖమండపంలో ఉత్తర భాగంలో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తారు. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కళ్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం కార్యక్రమం ఆలయ అర్చకులచే అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



