భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27: భద్రాద్రి క్షేత్రంలో లోకపావనులైన సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులతోపాటు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తన సతీమణి హేమలతతో కలిసి పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డిజిపి గురువారం సాయంత్రానికే భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ అధికారులతో బందోబస్తుపై చర్చించారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నందున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షణలో స్థానిక పోలీసులు భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, క్రమశిక్షణతో కళ్యాణాన్ని వీక్షించేలా చర్యలు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





