హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: రాష్ట్ర నూతన డీజీపీిగా బి.శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా నగరంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీి) భవనాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా భవనంలోని వివిధ అంతస్తులను, కార్యాలయాలను పరిశీలించారు. 4వ అంతస్తులో ఉన్న డాటా సెంటర్, ఇతర అధికారుల చాంబర్‌లు, 8వ అంతస్తులో స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, 18వ అంతస్తులో ఉన్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం, 19వ అంతస్తులో ఉన్న హెలిపాడ్ వంటివి పరిశీలించారు. ఆయన వెంట హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ఐసిసిసి డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి, డీసీపీ పుష్ప, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ కె.అపూర్వా రావు తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





