– అట్టహాసంగా సీతారాముల కల్యాణోత్సవం
కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 27: కరీంనగర్‌లోని మహా శక్తి అమ్మవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం జరిగిన రామయ్య పెళ్లి వేడుకలకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్త జన సందోహంతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బంది లేకుండా చల్లని నీళ్లు, మజ్జిగ సరఫరా చేశారు. ఎండ నుండి ఉపశమనం కలిగేందుకు కూలర్లు ఏర్పాటు చేశారు. 25 వేల మంది భక్తులకు సరిపడ భోజనాలు, ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. రామయ్య పెళ్లి వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్-అపర్ణ దంపతులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కల్యాణం అట్టహాసంగా కొనసాగాయి. యజ్ఞోపవీతం మొదలు కన్యదానం, జీలకర్రబెల్లం, తాళిబొట్టు వరకు సీతమ్మ-రామయ్య పెళ్లి వేడుకలను వేద పండితులు వివరిస్తూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





