– రామచందర్‌రావు ఆధ్వర్యంలో పాదయాత్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అని బీజేపీ ఓటర్లకు తెలియజేస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గురువారం పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం గురించి ప్రజలకు వివరించారు. పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





