కాంగ్రెస్ తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

– ప్రభుత్వంలో లేని వారు నిధులను తీసుకురాలేరు 
– కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి
– యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య సుధీర్ రెడ్డి 
పెన్ పహాడ్ (సూర్యాపేట జిల్లా), ప్రజాతంత్ర , డిసెంబర్ 12 : గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్, నారాయణగూడెం గ్రామాలలో కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన స‌ర్పంచ్‌ అభ్యర్థుల గెలుపు కోసం శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావ్య మాట్లాడుతూ  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వంలో లేనివారు ఇలాంటి నిధులు తీసుకురాలేరని తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని  చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు, ఉచిత కరెంటు, సన్న బియ్యం పంపిణీ, ధాన్యానికి మద్దతు ధర, రూ.500ల బోనస్ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  నాగుల పహాడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నారాయణ కృష్ణారెడ్డి, నారాయణగూడెం సర్పంచ్ అభ్యర్థి  నారాయణ హైమావతి ప్రవీణ్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు శ్రావ్య రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాగుల పహాడ్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఒగ్గు దేవయ్య, సీనియర్ నాయకులు ఏపూరి నగేష్,  సంకరమద్ది దామోదర్ రెడ్డి, మీసాల సోమయ్య, ఏ.రామిరెడ్డి లతోపాటు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *