కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

– స్పీకర్ ప్రసాద్ కుమార్

వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యపడుతుందని, పొరపాటున వేరే పార్టీలను గెలిపిస్తే అభివృద్ధి లేక అంధకారంలోకి పోతారని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని 6వ వార్డు వెంకటాపూర్ కాలనీలో డిసిసిబి మాజీ డైరెక్టర్ తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి జమున అబ్బాయిని గెలిపించాలని సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల‌లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రైతులకు రుణ మాఫీ, మహిళలకు జీరో వడ్డీకి రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, 20 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల అభివృద్ధికి బాటలు వే సిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో వికారాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తే వార్డులు అన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కిషన్ నాయక్ ఆధ్వర్యంలో వెంకటాపూర్ కాలనీ అన్ని రంగాల్లో అభివృద్ధితో తీర్చిదిద్దగా బంజారాహిల్స్ లా మారిందని పేర్కొన్నారు. వెంకటాపూర్ కాలనీలో ఇల్లు లేని వారు ఉండకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారికి భరోసాగా నిలుస్తామని తెలిపారు. బిఆర్ఎస్, బిజెపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *