అభివృద్ధి అంటే ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్ట‌డం కాదు

– మూసీ గోస‌-బీజేపీ భ‌రోసా పేరుతో ప‌రామ‌ర్శ యాత్ర‌
– మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో ముఖాముఖీ
– క‌న్నీటి ప‌ర్యంత‌మైన‌ అపార్ట్‌మెంట్ వాసులు
– బాధితుల‌కు అండ‌గా నిలుస్తాం
– మూసీ శుద్ధి పేరుతో పేద‌ల ఇళ్లు కూల్చ‌డం అన్యాయం
– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26:  మూసీ శుద్ధి పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, అభివృద్ధి ప్రజల కన్నీళ్లపై నిర్మించకూడదని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయ‌న ప్రకటించారు. ఇళ్లను కోల్పోతామన్న భయంతో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తూ, బీజేపీ వారి పక్షాన నిలబడుతుందని  భరోసా కల్పించారు. అలాగే గండి మైసమ్మ ఆలయ సమీపంలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసారు. మూసీ శుద్ధి పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, అభివృద్ధి ప్రజల కన్నీళ్లపై నిర్మించకూడదని బీజేపీ స్పష్టం చేస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులతో ఆయ‌న ముఖాముఖి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా  మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ఇళ్లు కోల్పోతున్నామని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ గోడు వెళ్ల‌బోసుకుంటూ ఆవేద‌న‌తో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. మ‌హిళ‌లు, వృద్ధులు త‌మ ఇళ్ల‌ను కోల్పోతామ‌న్న ఆందోళ‌న‌తో వున్నారు. బాధితుల సమస్యలను రామ‌చంద్ర‌రావు శ‌ద్ధ‌గా విన‌డ‌మే కాకుండా, బీజేపీ వారికి అండ‌గా నిలుస్తుంద‌ని హామీ ఇచ్చారు. కాగా  కాంగ్రెస్ ప్రభుత్వపు బలవంతపు కూల్చివేతలకు వ్యతిరేకంగా గురువారం భారతీయ జనతా పార్టీ చేపట్టిన “మూసీ గోస – బీజేపీ భరోసా” పరామర్శ యాత్ర మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు లంగర్‌హౌస్‌లోని  బాపూఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్రను ప్రారంభించారు. అనంతరం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశమై, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాల ఆవేదనను తెలుసుకున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బలవంతపు చర్యలను నిలిపివేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త‌ర్వాత ప‌రామ‌ర్శ‌యాత్ర
గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ ప్రాంతాల్లో కొనసాగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *