– కీలకం కానున్న హ్యామ్ రోడ్లు
– అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాలుగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
– రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతోపాటు అభివృద్ధికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌బి, ఎన్‌హెచ్‌ఏ శాఖల అధికారులతో సెక్రటేరియట్‌లో బుధవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీలో హ్యామ్ రోడ్లు కీలకం కానున్నాయని తెలిపారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాలుగా రోడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో చేపడతామని వెల్లడిరచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యామ్ రోడ్ల ప్యాకేజీల ఆమోదంతో తర్వాత టెండర్ ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్‌తో రోడ్ ప్యాకేజీల వివరాలు చర్చించారు. ఎన్‌హెచ్‌ఏ నార్మ్స్ ప్రకారం పూర్తిస్థాయిలో నాణ్యత పాటిస్తూ హ్యామ్ రోడ్లు నిర్మించాలని, పదేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా, క్వాలిటీ పాటించేలా వర్క్ ఏజెన్సీలకు ముందుగానే తెలియజెప్పాలని అధికారులతో అన్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తూ క్వాలిటీ చెక్ చేయడమేకాక లో లెవెల్ బ్రిడ్జి,హై లెవల్ బ్రిడ్జి వంటివి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా రవాణాకు అసౌకర్యం లేకుండా కన్సల్టెంట్ టీంలతో సంప్రదించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హ్యామ్ విధానంలో ఆర్‌అండ్‌బి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 శాతం రోడ్లు కవర్ అవుతాయనీ, దీన్ని సీిరియస్‌గా తీసుకొని అధికారులు రేయింబవళ్ళు కష్టపడాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనుల ప్రారంభంతోపాటు సదరన్ పార్ట్ ఆమోదం కోసం సిఎంతో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీని త్వరలో కలుస్తామని చెప్పారు. 65 జాతీయ రహదారుల పురోగతిపై ఆరా తీశారు. మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ పనుల పురోగతిపై చర్చించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఎన్‌హెచ్ అధికారులు, ఆర్‌అండ్‌బి ఈఎన్సీ జయ భారతి, సీఈలు రాజేశ్వర్‌రెడ్డి, మోహన్ నాయక్, ఎస్.ఈ ధర్మారెడ్డి, పలువురు ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.





