అభివృద్ధి చేసి చూపించే బాధ్య‌త నాది

– కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించండి
– ఏదులాపురంలో మంత్రి పొంగులేటి ప్ర‌చారం

ఏదులాపురం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4 : రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది.. మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు.. మీ దీవెనలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది.. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 28, 29, 30 వార్డుల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక మేటి (రోల్ మోడల్) మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సమస్యలన్నీ తీరుస్తాను.. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాను అని భరోసా ఇచ్చారు. మాటలు చెప్పే వారిని కాకుండా పని చేసే వారిని గుర్తించాలని ప్రజలను కోరారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల బిక్షం (10వ వార్డు), పేరం వెంకటలక్ష్మి (11వ వార్డు), నూకల రామ్మోహన్ రెడ్డి (28వ వార్డు), వెంపటి ఉమ (29వ వార్డు), కొట్టం శిరీష (30వ వార్డు)లను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *