– ఎస్సీ, ఎస్టీ నిధులు మైనార్టీలకు బదలాయింపు
– నిజాం నిరంకుశంపై అంకుశం దింపిన గడ్డ
– ఎన్నికల హాలను తుంగలో తొక్కిన సిఎం రేవంత్
- మహబూబ్‌నగర్ ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: తెలంగాణలో రాజకీయాలు చాలా దయనీయంగా ఉన్నాయని.. మనదేశ సంస్కృతి సంప్రదాయాలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. బుధవారం నాడు మహబూబ్ నగర్‌లోని ఎంవిఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నితిన్ నబీన్.. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ నిధులను మైనార్టీలకు బదలాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉందని గుర్తు చేశారు. ముస్లింల వోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ముస్లిం వోటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని నితిన్ నబీబ్ విమర్శించారు.నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచి పోరాడారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. ఎన్నికల హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హాలు నెరవేర్చలేదు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను ప్రభుత్వం మోసం చేసింది. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు ఆర్‌ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అవినీతి, కమిషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే భాజపాను గెలిపించాలి.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలను కూల్చారంటూ మండిపడ్డారు. ఆలయాలపై రాజకీయం చేస్తే.. బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. అవసరమైతే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే.. ఎక్కువ రోజులు ఉండబోదంటూ హెచ్చరించారు. ప్రధాని మోదీ.. మహిళలను లక్షాధికారులను చేయాలని చూస్తే.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు నితిన్ నబీన్ సూచించారు. తెలంగాణకు సముచిత స్థాయిలో కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో రైల్వేకు రూ.5,400 కోట్లకుపైగా కేటాయించింది. తెలంగాణకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు కేటాయించింది. రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతోంది. ఈయూతో ఒప్పందం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. కొన్నివర్గాలను సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో బలహీనవర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత పెడుతోంది. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తోంది. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపట్లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములు ఆక్రమిస్తున్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మం ద జరుగుతున్న దాడులను సహించం‘ అని నితిన్ నబీబ్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హాని కూడా అమలు చేయలేదని.. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలోనే కాదు.. బీఆర్‌ఎస్ పాలనలో సైతం పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయని.. చేతలు మాత్రం గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ ఒక్కరి ద చర్య తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్, రాహుల్ గాంధీ మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్రమంత్రి ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి పౌరహక్కులు కాలరాసిందంటూ బీఆర్‌ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యాలయంలో క్లర్క్ ఫోన్ సైతం ట్యాపింగ్ చేశారంటూ విమర్శించారు. సిట్ నోటీసులు టీవీ సీరియల్‌ను తలపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వోటు వేసి ఆశీర్వదించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని హా ఇచ్చారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయ దురహంకారం పెరిగిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్ రాంచందర్ రావు మండిపడ్డారు. బీజేపీని చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భయపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు గెలిస్తే మాత్రం ట్యాక్స్‌లు పెరుగుతాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మాత్రం.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తీరాలని కేడర్‌కు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి.. బీజేపీ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




