స్నేహ బంధము.. ఎంత మధురము

–  చిన్ననాటి మిత్రుని ఇంటికి డిప్యూటీ సీఎం

తాండూరు, ప్రజాతంత్ర, జులై 29: స్నేహమంటే ప్రాణమిచ్చే మనిషి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోసారి రుజువయింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ పర్యటన క్రమంలో యాలాల మండలము జుంటుపల్లి గ్రామంలోని డాక్టర్‌ రవీందర్‌ కుటుంబంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లందరినీ కొద్దిసేపు పక్కనపెట్టి చిన్ననాటి మిత్రుని కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు పేరుపేరునా ఆరా తీశారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినప్పటికీ చిన్ననాటి బంధాన్ని గుర్తుచేసుకొని మరీ ఇంటికి రావడమే కాదు.. ప్రజాప్రతినిధులు అందరినీ పక్కనపెట్టి ప్రత్యేకంగా సమయం కేటాయించి యోగక్షేమాలు ఆరా తీయడంతో డాక్టర్‌ రవీందర్‌ కుటుంబ సభ్యుల కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. ఈ సందర్భంగా రవీందర్‌ ఇంట్లోని ప్రతి గదిని భట్టి విక్రమార్క పరిశీలించి చదువుకున్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్థానిక సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల గురించి డాక్టర్‌ రవీందర్‌ కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎంకు వివరించగా ఆయన వెంటనే సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *