ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: టెక్నాలజీ తదితర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ మార్క్ లేమి బృందం బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. రాష్ట్రంలో వనరులు ,ఇతర అంశాలను అధ్యయనం చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ఫ్రాన్స్ బృందానికి సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండి కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





