– రూ.1551.89 కోట్లు విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: మూడెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు మంగళవారం జమ చేశామని, అందుకోసం రూ.1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు ఒక ప్రకటనలో తెలిపారు. 10.45 లక్షల మంది రైతుల 25.86 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ నిధులు జమ చేశామన్నారు. ఎన్ని ఎకరాలు అన్నది సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు త్వరలో జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.



