మధ్య ప్రాచ్యంలో యుద్దం వేళ చైనా దూకుడు

– తైవాన్ దిశగా యుద్ద నౌకలు, విమానాల మోహరింపు

తైపీ, మార్చి 16: మధ్య ప్రాచ్యంలో యుద్దంతో అంతా అటువైపు దృష్టి పెట్టగా చైనా మరోమారు తైవాన్‌పై దృష్టి సారించింది. రెండు వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం మళ్ళీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారీ సంఖ్యలో నౌకలు, చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. కాగా, ఫిబ్రవరి 27 నుండి ఈనెల 13 వరకు తైవాన్ సరిహద్దుల్లోకి చైనా యుద్ధ విమానాల రాక గణనీయంగా తగ్గింది. సాధారణంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో విమానాలను పంపే చైనా ఈ 16 రోజుల కాలంలో కేవలం 7 విమానాలనే పంపింది. అయితే ఈ ఆకస్మిక విరామానికి కారణమేంటో రక్షణ నిపుణులకు సైతం అంతుచిక్కలేదు. కానీ ఆదివారంనుండి చైనా మళ్లీ తన దూకుడును పెంచింది. తైవాన్ చుట్టూ సుమారు 26 చైనా సైనిక విమానాలను గుర్తించారు. వీటిలో 16 విమానాలు తైవాన్ నైరుతి ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి ప్రవేశించాయి. విమానాలతోపాటు 7 చైనా యుద్ధ నౌకలు కూడా తైవాన్ సముద్ర తీరానికి సవిÖపంలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 25న 30 విమానాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో విమానాలు రావడం ఇదే తొలిసారి. ఇలా ఉండగా, ఈనెల 31న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఇక, చైనా విమానాలు లేని సమయంలో కూడా వారి యుద్ధ నౌకలు సముద్రంలోనే ఉన్నాయని తైవాన్ రక్షణ మంత్రి వెల్లింగ్టన్ కూ స్పష్టం చేశారు. చైనా నుండి ముప్ప్పు ఏమాత్రం తగ్గలేదని, తాము నిరంతరం అప్రమత్తంగానే ఉన్నామని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *