పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలి

– టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఒక ప్రకటనలో తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఉద్బోధించారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని, ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతీ విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *