– ఇసుక మాఫియా పనే : మాజీ మంత్రి హరీష్ రావు
పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 25: కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న సిఎం రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ఎవరు కట్టారని సిద్ది పేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించా రు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుం టపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్ను పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, దాసరి మనోహర్ రె డ్డి, రసమయి బాలకిషన్, నారదాసు లక్ష్మణావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలే నన్నారు. కాంగ్రెస్ హయంలో చెరువు లు, చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య చర్య గా మారిందన్నారు. గతంలో పెద్దపల్లి భోజన్న పేట వద్ద హుస్సేన్ మియావా తగుపై కూడా చెక్ డ్యామ్ పేల్చివేశారని ఆరోపించారు. గుంపుల వద్ద చెక్ డ్యా మ్ కూడా కూలలేదని.. పీల్చారని ఇక్కడి రైతులే చెప్తున్నార న్నారు. ఇసుక మాఫియానే కూల్చివేసిందని, కాంగ్రెస్ పాలన లో వేల కొద్ది లారీల్లో ఇసుక తరలిస్తున్నారన్నారు. రాత్రికి రాత్రి చెక్ డ్యామ్ పేల్చేశారని.. భోజన్నపేటలో హుస్పేస్ మియావాగుపై చెక్ డ్యామ్ పీల్చివేస్తుంటే రైతులే పట్టుకున్నా రన్నారు. అప్పుడు రైతులే కేసులు పెట్టారని, పోలీసులు ఇప్ప టివరకు దోషులను పట్టుకోలేదని ఆరోపించారు. తాజాగా మరో చెక్ డ్యామ్ పేల్చారనిని, అప్పుడే పోలీసులు దోషులను శిక్షిస్తే ఈ రోజు గుంపుల చెక్ డ్యామ్కు ఈ పరిస్థితి రాకుం డేదన్నారు. మూడు రోజులు అయిన దోషులను పోలీసులు పట్టుకోలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లను కాపాడుతుందని, ఆనాడు గుండాలను అరెస్ట్ చేస్తే ఈ రోజు ఇక్కడి చెక్ డ్యామ్ పేల్చకపోయేవాళ్లని, హైదరాబాద్ లో ఇండ్లు, ఇక్కడ చెరువులు, చెక్ డ్యామ్లు కూలగొడుతున్నారన్నారు. కేసీఆర్ కట్టుడు.. కాంగ్రెసోళ్ల కూలగొట్టూడని.. మానేరు నది మీద చెక్ డ్యామ్లు కట్టి సస్యశ్యామలం చేశామన్నారు. పొంగులేటి శ్రీనివా స్‌కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ చేసిందని, చర్యలు తీసుకోవాలంటే పొంగులేటిపై తీసుకోవాలన్నారు. రాఘవ కంపెనీని బ్లాక్ చేయాలన్నారు. పొంగులేటి నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 6 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పిండని, ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. రెండేళ్లు అయిన కాళేశ్వరం రిపేర్ చేయడం లేదని, కాళేశ్వరం కింద ఉన్న కాలువలు తవ్వడం లేదన్నారు. కాలువలు తవ్వితే కేసీఆర్కు పేరు వస్తుందని రైతును గోసపి డుతున్నారన్నారు. ఈ బ్లాస్టింగ్స్ చూస్తే కాళేశ్వరం కూడా పీల్చారని అనుమానం వస్తుందన్నారు. పెద్దపల్లిలో జిలిటెన్ స్టిక్స్ కాంగ్రెస్ నాయకులు రెడ్ హ్యాండెడ్గా దొరికారని.. ఇసుక మాఫియా తో రూ.24 కోట్లు రికవరీ చేయాలన్నారు. ఎండాకాలం లోపే చెక్ డ్యామ్ నిర్మించాలని, ఇసుక మాఫియాలో మంత్రుల వాటా ఉందని.. రాత్రిపూట పెద్దశబ్దం వినపడిందని మత్స్యకారులు చెప్తున్నారన్నారు. లక్ష క్యూసెక్కుల వరద వొస్తే కూడా ఈ చెక్ డ్యామ్ చెక్కు చెదరలేదన్నారు. కూలలేదు కూల్చారు అంటూ ఆరోపించారు. ఇసుక మాఫియా దోషులను శిక్షించకుంటే రాష్ట్రంలో మరిన్ని చెక్ డ్యామ్లు పేలుస్తారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




