సమయానికి సరఫరా జ‌రగాలి

– గృహ వినియోగ సిలిండ‌ర్ల‌పై సీఎస్ సమీక్ష

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13 : రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్‌పీజీ నిల్వలు, వినియోగదారులకు గ్యాస్ పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై విభాగం అధికారులతో శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సరఫరా, నిల్వలు, రవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమయానికి సరఫరా జ‌రిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు. రాష్ట్రంలో రోజువారీ సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఏజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుత డిమాండ్‌కు సరిపడ నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్టళ్లకు డిమాండ్ మేరకు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. గృహ వినియోగదారుల సిలిండర్ల సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 810 డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయని చెప్పారు. వినియోగదారులకు సకాలంలో డెలివరీ జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.  సమావేశంలో హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *