కాళేశ్వరంపై కావాలనే దుష్పచ్రారం

మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కావాలనే పదేపదే కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటిని ఉపయోగించకుండా పక్కన పెట్టారన్నారు. సిద్దిపేటలో 167 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాలకు గోదావరిలో 8 లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయి. మోటార్లు ఆన్‌ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు. మోటార్లు ఆన్‌ చేస్తే వారం రోజుల్లో రంగనాయకసాగర్‌ నిండిపోతుంది. మేడిగడ్డ కూలితే మోటార్లు, లారీలు ఎలా నడుస్తున్నాయని అన్నారు. రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లు కాళేశ్వరంలో భాగం కావా? ఇవేవిూ చూడకుండా కాళేశ్వరం కూలిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చపెడితే.. విూరేం చేశారో.. మేమేం చేశామో మాట్లాడుకుందాం అన్నారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారు. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే ఆరు నెలల్లో నీళ్లు ఇవ్వొచ్చు. మేం ప్రశ్నించడంతోనే కల్వకుర్తి మోటార్లు ఆన్‌ చేశారు. నాట్లకు నాట్లకు మధ్య కేసీఆర్‌ రైతుబంధు ఇచ్చారు. ఓట్లకు ఓట్లకు మధ్య విూరు రైతుభరోసా ఇస్తున్నారు. రైతుభరోసాను ఎలా కోత పెడదామనే చూస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *