ముగ్గురి మృతి
న్యూదిల్లీ, జూన్ 10 : దిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్టుమెంట్‌లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతుండగా మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి ఓ కుటుంబం కిందకు దూకింది. ఈ కుటుంబంలోని తండ్రితోపాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక ఎనిమిది అగ్నిమాపక శకటాల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానికులు ఈ ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను దూరంగా పంపించి వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





