యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 2: యాదగిరిగుట్ట పురపాలికలోని ఆరో వార్డులో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని ఆ కాలనీకి చెందిన సీనియర్ నాయకుడు తాళ్ల రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాచేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల తెగ సంచార కుటుంబీకులు గతంలో యాదగిరిగుట్టకు రాగా కొందరి స్వార్థ రాజకీయాల వల్ల వారికి ఓటు హక్కు కల్పించారని తెలిపారు. కానీ నేటికీ వారికి ఇక్కడ స్థిర నివాసం లేదని, వీరిలో చాలామంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారన్నారు. ఇక్కడ వారికి ఓటు హక్కును అలాగే ఉంచడం వల్ల రిజర్వేషన్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఆంధ్ర తోపాటు తెలంగాణలోనూ వీరికి ఓటు హక్కు ఉన్నాయని, దాచేపల్లిలో 127, 128 లో వీరికి ఓట్లు ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. యాదగిరిగుట్టలో 3-133 అనే ఇంటి నెంబర్ పై బై వేసి దాదాపు 80 పైగా ఉన్నవీరి ఓట్లను వెంటనే తొలగించాలని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరపాలని ఆయన కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



