వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు

– 15నుంచి సీట్ల భర్తీకి తొలి విడత ప్రక్రియ
– ‘దోస్త్ ‘ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రా ష్టంలో వచ్చే విద్యా సంవత్సరం 2026 -27లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను. తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ పక్రియ కొనసాగుతుంది. అర్హులైన విద్యార్థులు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే. 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం క ల్పించారు. ఒక మే 14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్ల కేటా యింపు అనంతరం ఆన్లైన్లో సెల్ఫ్ రిపో ర్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ పక్రియ మే 15వ తేదీ నుం చి మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 30వ తేదీ సీట్లు కేటాయిస్తారు. మూడో విడత రిజిస్ట్రే షన్ పక్రియ మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు జరగనుంది. జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూ న్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుం ది. రెండో, మూడో విడత సీట్ల కేటాయింపు అనంతరం కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *