– అందె శ్రీ మృతికి ప్రధాని సంతాపం
న్యూదిల్లీ, నవంబర్ 10: అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారని కొనియాడారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి, ప్రజల సాంఘిక హృదయ స్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయన్నారు. ఆయన సామాజిక స్పృహను సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయన్నారు. ఓం శాంతి అంటూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధాని తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





