దీనదయాళ్ ఆశయాలు మార్గదర్శకం కావాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతీ కార్యకర్తకు అత్యంత ముఖ్యమని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవ దర్శనం’ (ఇంటెగ్రల్ హ్యూమనిజం), అంత్యోదయ సిద్ధాంతాలను స్పష్టంగా అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను మార్గదర్శకంగా తీసుకుని మొదటగా సమాజంలోని చివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు చేరేలా చూడడం బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. భారతీయ జనసంఘ్ నాయకుడిగా, రాజకీయ తత్వవేత్తగా, ఏకాత్మ మానవతావాదం సిద్ధాంత ప్రతిపాదకుడిగా పండిట్ జీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ నిర్మాణంలో సిద్ధాంతాల కోసం అంకితభావంతో పనిచేసిన ఆ మహనీయుడి స్ఫూర్తిని ప్రతీ కార్యకర్త ఆచరణలో పెట్టాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *