– కుటుంబ విలువల పతనంతో అశాంతి
– మంత్రి జూపల్లి ఆవేదన
వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: సమాజంలో పెరుగుతున్న అంతరాలు, కు టుంబ బంధాల క్షీణతపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం లోని చిన్నదగడ గ్రామంలో గ్రామస్తుల sqrt(5) ముచ్చటించారు. ఆధునిక యుగం లో మనిషి నింగిలోకి శాటిలైట్లు పంపు తున్నప్పటికీ, కుటుంబ అనుబంధాలను కాపాడుకోవడంలో వెనుకబడిపోతున్నాడని పేర్కొన్నారు. మన సంస్కృతిలో ఒకప్పుడు కుటుంబ గౌరవం కోసం త్యాగాలు చేసిన ఉదాహరణలు ఉన్నాయని, శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన సంఘటనను గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రేమానురాగాలకంటే సంపాదనపై మోజు పెరిగి ఆస్తి వివాదాల కారణంగా సొంత వారిలోనే ద్వేషాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడం వల్ల సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయ న అభిప్రాయపడ్డారు. గతంలో కుటుం బంలో పెద్దలు ఉండి సమస్యలను పం చుకునే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఏకాకి జీవన విధానం కారణంగా చిన్న సమస్యలకే మనసు బలహీనపడుతోందని తెలిపారు. అప్పులు, చిన్నపాటి మనస్పర్థలు ప్రాణాలు తీసుకునేంత పెద్దవి కావని, అందరూ కలిసి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని గ్రామస్తులకు సూచించారు.అలాగే శాస్త్రీయ ప్రగతి (సైన్స్ ప్రోగ్రెస్) ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడంలో లోపాలు ఉన్నాయని చెప్పారు. నింగిలోకి శాటిలైట్లు పంపుతున్నప్పటికీ, నదీ జలాలను పంట పొలాలకు మళ్లించలేక పోతున్నామని పేర్కొన్నారు. రైతులకు భరోసా కల్పించడం అత్యవసరమని నొక్కి చెప్పారు. కుటుంబ, నైతిక విలువలు తగ్గిపోవడం వల్ల సామాజిక సంఘర్షణ (సోషియల్ కానిక్ట్), సామాజిక అశాంతి (సోషియల్ ఆన్రెస్ట్) పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలను తొలగించి ప్రజల్లో అవగాహన కల్పిం చేందుకు ప్రభాతభేరి అనే సామాజిక చైతన్య కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





