– ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మార్పులు
– ప్రపంచానికి భారత్ ఆశాకిరణం
– ఈయూ ఒప్పందంతో కొత్త అవకాశాలు
-మీడియాతో ప్రధాని మోదీ
న్యూదిల్లీ, జనవరి 29 : దేశ అభివ ద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రజల అభివద్ధి సౌభాగ్యాలే లక్ష్యంగా పథకాలు, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆధునిక సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా తామూ మారతామని చెప్పారు. అయితే, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటూ సాంకేతికతను జోడించి ముందుకు సాగుతామని అన్నారు. ప్రజల స్థానాన్ని సాంకేతికత భర్తీ చేయజాలదని కూడా ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని అన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణమని చెప్పారు. ఇక ఈయూతో వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని తెలిపారు. ఈ ఒప్పందం నుంచి భారత పారిశ్రామిక వర్గాలు లబ్దిపొందాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులను ఈయూ దేశాలకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఐరోపా సమాఖ్యతో కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. అది శుభసూచికమన్నారు. రీఫార్మ్`పెర్ఫామ్` ట్రాన్స్‌ఫామ్ అంటూ బ్జడెట్ టోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం భారత్ రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌లో ముందుకెళ్తోందని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. అలాగే సాంకేతికత మనుషులకు ప్రత్యామ్నాయం కాదని మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం. అన్నిరంగాల్లో అభివ ద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోంది. వికసిత్ భారత్ కోసం ఎంపీలు క షి చేయాలి. పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు లభిస్తుండటంతో భారత్‌ను సుస్థిరదేశంగా ప్రపంచం చూస్తోంది. ట్రేడ్‌డీల్‌తో కొత్త మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వాటినుంచి తయారీదారులు లబ్ది పొందాలని కోరుతున్నాను. ఈయూలోని 27 దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని పేర్కొన్నారు. మనం టెక్నాలజీతో పోటీపడతాం. దానిని అందిపుచ్చుకుంటాం. దాని సామర్థ్యాన్ని అంగీకరిస్తాం. అయితే అది మనుషులను భర్తీ చేయలేదని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





