– మొరాదాబాద్‌లో డెంటల్ విద్యార్థి అరెస్ట్
లక్నో, మార్చి 17: యుపిలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారిపై దాడులు కొనసాగుతున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 19 ఏళ్ల వైద్య విద్యార్థిని యుపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో పనిచేస్తున్న ఐసిస్ అనుబంధ ఆన్‌లైన్ నెట్‌వర్క్ కార్యకలాపాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా షహరాన్‌పూర్ జిల్లాకు చెందిన హారీష్ అలీని ఆదివారం మొరదాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు ఎటీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. బిడిఎస్ (డెంటిస్ట్) రెండో సంవత్సరం చదువుతున్న హారీష్ అలీ, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌డియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు సెషన్, డిస్కార్ట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్‌ల ద్వారా ఐసిస్ సభ్యులు, సానుభూతిపరులతో సంబంధాలు కలిగి ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. ఐసిస్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి, దేశంలో ఉగ్రవాద సంస్థను బలోపేతం చేయడానికి వ్యక్తులను నియమించడం లక్ష్యంగా ఆన్‌లైన్ గ్రూపులను సృష్టిస్తున్నారని ఎటిఎస్ తెలిపింది. నిందితులు అల్ ఇత్తిహాద్ మీడియా ఫౌండేషన్ అనే పేరుతో ఒక ప్రత్యేక గ్రూపును కూడా నడిపారని, భారత్‌తో పాటు విదేశాల్లో ఐసిస్ నెట్‌వర్క్‌లోని వ్యక్తులతో సంబంధాలు కొనసాగించారని అధికారులు తెలిపారు. లక్నోలోని ఎటిస్ పోలీస్ స్టేషన్‌లో యుఎపిఎ మరియు బిఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎటిఎస్ పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




