13మంది కుటుంబీకులను చంపిన వ్యక్తికి మరణ శిక్ష

– బాలుడితో కాల్చి చంపించిన అఫ్టాన్‌ పోలీసులు

కాబూల్‌, డిసెంబర్‌ 3 : తాలిబన్‌ పాలిత అఫ్ఘానిస్తాన్‌లోని కోస్ట్‌ ప్రాంతంలో ఓ నిందితుడికి ఒక మరణ శిక్ష విధించిన తీరు సంచలనం రేకెత్తించింది. ఒకే కుటుంబానికి చెందిన 13మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు మంగల్‌ను 13 ఏళ్ల బాలుడి చేత కాల్చి చంపించారు. శిక్షను స్థానిక స్పోర్ట్స్‌ స్టేడియంలో 80 వేల మంది ప్రజల ముందు అమలు చేశారు. అఫ్ఘాన్‌ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ’ఖిసాస్‌’ అంటే ప్రతీకార శిక్ష జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మంగల్‌ పది నెలల క్రితం అలీ షిర్‌ టెరెజియో జిల్లాల్లో నివసించే అబ్దుల్‌ రహ్మాన్‌, అతని కుటుంబంలోని 12 మందిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్యలకుగాను అతనికి జీవిత ఖైదు విధించారు. శిక్ష అమలు సమయంలో తాలిబాన్‌ అధికారులు మంగల్‌కు క్షమాభిక్ష పెడతావా అని ఆ కుటుంబంలో బతికున్న బాలుడు అబ్దుల్‌ రహ్మాన్‌ను అడిగారు. అందుకు బాలుడు నిరాకరించడంతో అతనికి తుపాకీ ఇచ్చి మంగల్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపించారు. ఈ సందర్భంగా స్టేడియం భిడ్డు ’అల్లాహు అక్బర్‌’ నినాదాలతో దద్ధరిల్లింది. కోస్ట్‌ పోలీస్‌ ప్రతినిధి ఈ ఘటనను ధ్రువీకరించారు. తాలిబాన్‌ పాలితంలో షరియా చట్టం కింద ఇలాంటి బహిరంగ శిక్షలు పెరుగుతున్నాయి. అయితే అంతర్జాతీయ సమాజం ఈ శిక్షను అమానవీయమైనది, అత్యంత క్రూరమైనది అని ఖండిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *