– ఇందులో బిజెపి రాజకీయ కుట్ర దాగి ఉంది
– పునర్విభజనను రాజకీయ పావుగా వాడుకుంటున్న ప్రధాని మోదీ
– జనాభా లెక్కల అనంతరం మహిళా బిల్లు అని చెప్పారు
– ఆ మేరకే గతంలో బిల్లు పెట్టి ఇప్పుడీ హడావిడి ఎందుకు?
– పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై అనుమానాలు ఉన్నాయి
– 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
– జనాభా లెక్కల తరవాత నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి
– దక్షిణాదిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఉత్తరాది సీట్ల పెంపు
– 50శాతం సీట్ల పెంపు ఏ ప్రాతిపదకనో ఎందుకు చెప్పడం లేదు
– మీడియా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్13: మహిళా రిజర్వేషన్లు, పునర్విభజనను కలపడంతో రాజకీయ కుట్ర ఉందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళారిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోపాటు కట్టుబడి ఉంటామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళల రాజకీయ సాధికారితకు కాంగ్రెస్ మొదటి నుంచి కట్టుబడి ఉంది.. నియోజకవర్గాల పునర్వభజనను ప్రధాని మోదీ రాజకీయ పావుగా వాడుకుంటున్నాడని ఆరోపించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. డీలిమిటేషన్ అనేది రాజకీయ పార్టీలకో, ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ ..దీనిని మహిళా రిజర్వేషన్లతో కలిపి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని విమర్శించారు. సచివాలయంలో మంత్రులు, ఎంపిలు, ఇతర నాయకులతో కలసి సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు వోటు హక్కు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళలు ముఖ్యమైన పదవులు చేపట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ రెండు అంశాలను అనుసంధానించడం వెనుక రాజకీయ కుట్ర, వివక్ష ఉన్నాయని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉందని ప్రకటించిన సీఎం రేవంత్, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సీట్ల ఆధారంగానే ఈ బిల్లును అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ బిల్లును అమలు చేసి ఉంటే మరింత మంది మహిళలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యేవారని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోనే పురుషులతోపాటు మహిళలకు వోటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అప్పటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలకు వోటు హక్కు లేదని అన్నారు. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్దమైన పదవుల్లో మహిళలకు కాంగ్రెస్ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. మహిళల నాయకత్వంలో పనిచేసిన పార్టీ కాంగ్రెస్.. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీ
మహిళలంటే బీజేపీకి చిన్న చూపు : రేవంత్ రెడ్డి చురకలు
సీట్ల పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్ ముఖ్యం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో నెంబర్ ముఖ్యం అంటూ వాజపేయి ప్రభుత్వం ఒక్క వోటుతో పడిపోయిందని గుర్తు చేశారు. నెంబర్ లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరని అన్నారు. ఇకపోతే ఇప్పటివరకు15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగింది.. కాని ఇప్పటివరకు భారతీయజనతా పార్టీ అధ్యక్షురాలి గా ఒక్క మహిళ నియామకంజరగలేదని సిఎం రేవంత్ చురకలంటించారు. బీజేపీకి మహిళ పట్లగౌరవం, చిత్తశుద్ది ఉందో అర్థమౌతుందన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేస్తుందా.. అని ప్రశ్నించారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలుదక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ,ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం.. అన్నారు. మా ఎంపీలు తెలంగాణను సాధించారు.. ఇప్పుడు పునర్విభజన పైన కూడా పోరాడుతారని సిఎం అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం అని అన్నారు. పార్లమెంట్ లో బిల్లును ఎలా ఆమోదిస్తారోచూస్తాం.. 60యేళ్లలోమహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది..46యేళ్లలో ఒక్క మహిళను పార్టీ అధ్యక్షురాలిని బీజేపీచేయలేదు.. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. మహిళలను చిన్న చూపు చూడటమే బీజేపీ లక్షణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారు.. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ దే అన్నారు. 50శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మోదీ ఇంటి ముందు బంట్రోతు లుగా నిలబడాల్సి వస్తుంది.. వాళ్ల అవసరం ఇక ముందు ఉండదన్నారు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతోపాటు దిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు కుదీనిపైన లేఖ రాస్తానని సిఎం రేవంత్ అన్నారు. గతంలోనియోజకవర్గాలపునర్విభజన మూడు సార్లు జరిగింది.. 1967 లో 52 0సీట్లకు పెంచారు,1976 లో 542సీట్లకుపెంచారు..తర్వాత సిక్కిం నుంచి ఒక సీటు పెరిగి 543 కి పెరిగింది.. 2001 లో వాజ్‌పేయి పునర్విభజన పైన చట్ట సవరణ చేశారు. దాని వల్ల 2009 లో తెలంగాణకు 17, ఆంధ్రాకు 25 ఎంపీ సీట్లు వచ్చాయి. తెలంగాణ కు 119, ఎపీకి 175 శాసన సభ సీట్లు పెరిగాయి.. స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





