హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఎట్టకేలకు తెలంగాణలో వివిధ జిల్లాల ప్రెసిడెంట్ పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాను అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం విడుదల చేశారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో వున్న ఈ నియామకాలు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విడుదల చేయడం గమనార్హం. వివిధ జిల్లాల డి.సి.సి. అధ్యక్షుల వివరాలీవిధంగా వున్నాయి. డాక్టర్ నరేష్ జాదవ్ (ఆదిలాబాద్), అత్రం సుగుణ (అసీఫాబాద్), తోట దేవి ప్రసన్న (భద్రాద్రి-కొత్తగూడెం), బీర్ల ఐలయ్య (భువనగిరి), ఎం. రాజీవ్‌రెడ్డి (గద్వాల్), ఈగల వెంకటరాంరెడ్డి (హనుమకొండ), సయ్యద్ ఖలీద్ సైఫుల్లా (హైదరాబాద్), గజెంగి నందయ్య (జగిత్యాల), లఖావత్ ధన్వంతి (జనగాం), భట్టు కరుణకుమార్ (జయ్‌శంకర్ భూపాలపల్లి), మల్లికార్జున్ ఆలె (కామారెడ్డి), మేడిపల్లి సత్యం (కరీంనగర్), వి. అంజన్‌కుమార్ (కరీంనగర్ కార్పొరేషన్), మోథ మోహిత్ ముదిరాజ్ (ఖైరతాబాద్), నూతి సత్యనారాయణ (ఖమ్మం), దీపక్ చౌదరి (ఖమ్మం కార్పొరేషన్), భుక్య ఉమ (మహబూబాబాద్), ఎ. సంజీవ్ ముదిరాజ్ (మహబూబ్‌నగర్), పిన్నింటి రఘునాథ్‌రెడ్డి (మంచిర్యాల్), శివన్నగరి ఆంజనేయులు గౌడ్ (మెదక్), తోటకూర వజ్రేష్ యాదవ్ (మేడ్చల్మ-మల్కాజ్‌గిరి), కె. దీపక్ జాన్ (సికింద్రాబాద్), తూముకుంట ఆంక్షారెడ్డి (సిద్దిపేట్), గుడిపాటి నర్స య్య (సూర్యాపేట్), దారాసింగ్ జాదవ్ (వికారాబాద్), కె.శివసేనారెడ్డి (వనపర్తి), మహమ్మద్ ఆయూబ్ (వరంగల్).
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




