– పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం)లో పార్టీ ఘనంగా నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదర సోదరీమణులందరికీ ఆయన పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తనను ఆహ్వానించిన మైనారిటీ నేతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్‌ను అమలు చేయకుండా వారిని మోసం చేసిందన్నారు ఈరోజు నుంచే ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మైనారిటీ వర్గాలను కాంగ్రెస్ ఏ విధంగా వంచించిందో సాక్ష్యాధారాలతో ఎండగడతామని స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న ప్రతి హామీపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





