– పోలీసుల దర్యాప్తులో అంగీకరించిన నిందితురాలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి25: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారానికి అడ్డుపడిందని తల్లిని ప్రియుడి సాయంతో కుమార్తె చంపేసింది. ఈ ఘటన నగరంలోని జవహర్‌నగర్ పరిధి కౌకూర్ భరత్‌నగర్‌లో జరిగింది. 10 నెలల క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీనిపై జవహర్‌నగర్ పీఎస్‌లో పెద్ద కుమార్తె ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్స్‌ను పోలీసులు విశ్లేషించడంతోపాటు స్థానికులను విచారించారు. ఈ క్రమంలో తల్లిని చంపినట్లు చిన్న కుమార్తె ఇషిక అంగీకరించింది. ప్రియుడు మౌంటీరాజ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు వెల్లడించింది. ప్రియుడితో సహజీవనంపై తల్లి మందలించడంతో ఆమెను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు తెలిపింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
——————————————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.