స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో మామపై కోడలి విజయం

జగిత్యాల, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 14 : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతుండగా, మరోవైపు కుటుంబ రాజకీయాల మధ్య ఆసక్తికర పోటీలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్ గ్రామంలో జరిగిన రాజకీయ సమరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మామ సత్యనారాయణను ఓడించి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోడలు రాధిక కేవలం 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మామ–కోడలి మధ్య సాగిన ఈ పోరు గ్రామ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *