3న అలయ్‌ బలయ్‌ కార్యక్రమం

 – ప్రముఖులకు దత్తాత్రేయ ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : దసరా సందర్భంగా ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని 3న నిర్వహిస్తున్నామని అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు. బండారు దత్తాత్రేయ కుమార్తె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ఉద్యమకారులకు, ప్రముఖులకు సన్మానం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులకు దత్తాత్రేయ స్వయంగా ఆహ్వానాలు అందించారు. గవర్నర్‌గా పదవీ కాలం ముగియడంతో ఆయన స్వయంగా ఈ కార్యక్రమం చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *