– 14 నుంచి 15కు ఎందుకు మారింది?
– భూ భ్రమణంలో మార్పులే అసలు కారణం
– 2081 నుండి జనవరి 16న సంక్రాతి పండుగ!
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాలలో పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డి వంటి వివిధ పేర్లతో పండుగ చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో ఈ పండుగను చేసుకుంటారు. మకర సంక్రాంతి సౌర చక్రం ఆధారంగా ఉంటుంది. అందువల్ల, ఇది దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో సంక్రాంతి పండుగ తేదీ మారింది. చాలా సంవత్సరాలపాటు జనవరి 14వ తేదీనే సంక్రాంతిని జరుపుకునే వాళ్లం. అయితే 2008 నుంచి మాత్రం జనవరి 15వ తేదీన సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉందట. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యలో వచ్చిన చిన్న మార్పు వల్లే సంక్రాంతి పండుగ జనవరి 14 నుంచి 15కు మారిందట. భూమి తన కక్ష్యలో తిరుగుతూ స్వల్పంగా దిశ మార్చుకోవడం వల్ల సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం కొద్దిగా మారుతుంది. ప్రతి సంవత్సరం ఈ మార్పు సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఈ తేడా వల్ల సుమారు 72 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి తేదీ ఒక రోజు తర్వాతకు జరుగుతుంది. అందుకే 1935 నుంచి 2007 వరకు జనవరి 14న ఉన్న సంక్రాంతి, 2008 నుంచి జనవరి 15కి మారింది. ఇలా 2080 సంవత్సరం వరకు జనవరి 15వ తేదీనే సంక్రాంతి వస్తుందట. 2081వ సంవత్సరం నుంచి సంక్రాంతి జనవరి 16కు మారుతుందట.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.