మీడియా సమావేశం లో పీఠాధిపతి ఖుసృ పాషా
కాజిపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 20: కాజీపేటలో గురువారం నుంచి 3 రోజుల పాటు జరుగనున్న కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బీయాబాని దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్దం అని బుధవారం దర్గా పీఠాధిపతి ఖుసృ పాషా తెలిపారు. మతసామరస్యానికి ప్రతికగా నిలిచే కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బీయాబాని ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధమైందని తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవాలకు దేశవ్యాప్తంగా అన్ని మతాలకు సంబంధించిన మత పెద్దలు రానున్నారన్నారు, ఈ నెల 21 నుంచి 23వ తారీకు వరకు జరిగే ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలలను నుంచి కుల, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు రానున్నారని ఆయన తెలిపారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, కరెంట్, వివిధ విభాగాల సిబ్బంది సహకరిస్తున్నారని, ప్రతి రోజు 3000 మందికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.




