దండుపాళ్యం బ్యాచ్‌ ఎవరిదో ప్రజలకు బాగా తెలుసు

-అవినీతి, అక్రమాలు కప్పిపుంచుకుంటే పోవు
-హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై ఘాటుగా మంత్రి శ్రీధర్‌బాబు స్పందన 

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 18: ‌దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌నేతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ ‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత పాలనా వైఫల్యాలను దాచేందుకు మైండ్‌ ‌గేమ్‌ ఆడుతున్నారని తెలిపారు. అవినీతి, అక్రమాలతో రాజ్యమేలిన వారు ఇప్పుడు మాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలా విమర్శలు చేసి, అవినీతి, అక్రమాలను దాచుకోలేరని గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ మంత్రులందరిదీ ఒకటే జెండా, ఒకటే అజెండా అని, గత 20 నెలల్లో రాష్టాన్రికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని శ్రీధర్‌ ‌బాబు గుర్తు చేశారు. తమ పాలన అభివృద్ధే లక్ష్యంగా నడుస్తుందని, ఎలీ లిల్లీ లాంటి అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు రావడం తమ కృషికి నిదర్శనమని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోని అంతర్గత కుమ్ములాటల్ని కప్పిపుచ్చుకోవడానికి తమపై బురద చల్లడం మానాలని హితవు పలికారు. విజ్ఞులైన ప్రజలు  మైండ్‌ ‌గేమ్‌లను నమ్మరని గుర్తుంచు కోవాలని, రాజకీయాలను పక్కన పెట్టి రాష్టాభ్రివృద్ధికి సహకరించాలని బీఆర్‌ఎస్‌ ‌నేతలకు విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో రూ.12, 864 కోట్ల ఎఫ్‌డీఐలు తెలంగాణకు వచ్చాయన్నారు. 33 శాతం పెరుగుదలతో దేశంలో టాప్‌ 3 అర్బన్‌ ఎఫ్‌డీఐ కేంద్రాల్లో హైదరాబాద్‌ ఉం‌దని తెలిపారు. పరిశ్రమల జీఎస్‌వీఏ రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని పేర్కొన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా విమర్శలు చేస్తున్న హరీష్‌ ‌రావు తదితరుల తీరుపై శ్రీధర్‌ ‌బాబు మండిపడ్డారు. పదేళ్లలో చేయలేని ఎన్నో పనులను ఈ రెండేళ్ల స్వల్ప కాలంలో తాము చేసి చూపామని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *