సీఎం నిర్ణయంపైనే రాజీనామా ఆధారం

– అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తా
– ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : తన పదవికి రాజీనామాపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా అంశాన్ని సీఎం నిర్ణయంతో ముడిపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయమని వెనకాడనన్నారు. తాజాగా విూడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్‌నగర్‌, నారాయణగూడలో రూ.1.40కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. ‘సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశా.. కేసు పెండిరగ్‌ ఉంది.. స్పీకర్‌ దగ్గర కూడా అనర్హత పిటిషన్‌ పెండిరగ్‌లో ఉంది.. సుప్రీంకోర్టులో నా వైపు నుంచి వాదనలు వినిపిస్తా.. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. నాకు ఎన్నికలు కొత్త కాదు.. ఇప్పటికి 11సార్లు కొట్లాడిన చరిత్ర ఉంది’ అని చెప్పారు. రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్‌ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని నాగేందర్‌ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *