ఎనిమదేళ్లు దాటిన పరికరాలను స్క్రాప్‌ చేయాలి

– ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి దామోదర సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ఆరోగ్య శాఖ పనితీరుపై రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో శానిటేషన్‌, ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు, పరికరాల వినియోగంపై చర్చించారు. మెరుగైన వైద్య సదుపాయాల కల్పనపై, గాంధీ హాస్పిటల్‌ బ్రాండిరగ్‌పై కూడా చర్చించారు.ఎమర్జెన్సీ పరకరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని మంత్రి ఆదేశించారు. ఎనిమిదేళ్లు దాటిన పరికరాలను స్క్రాప్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్‌సీడీ క్లినిక్‌ల పనితీరుపై చర్చించారు .
ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు ఐదు అంతస్తులతో సీఎస్‌ఆర్‌ నిధులతో సౌకర్యవంతమైన భవనం ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సమీక్షలో హెల్త్‌ సెక్రటరి డాక్టరు క్రిస్టినా చోంగ్తూ, హెల్త్‌ కమిషనర్‌ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ వీణఫణింద్ర రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌ కుమార్‌, హెచ్‌ఓడీలు డాక్టర్‌ రవీంద్ర కుమార్‌, డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, ఉన్నతాధికారులు డాక్టర్‌ వాణి, డాక్టర్‌ విమల థామస్‌లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *