– సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపుపై దాడులు
– నెల రోజుల్లో 2,089 కేసుల నమోదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా పౌరసరఫరాల సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్యాస్ సిలిండర్లను అక్రమ నిల్వ, పక్కదారి పట్టించే వారిపై అధికారులు నిఘా ఉంచి, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. గహ వినియోగ సిలిండర్ల సరఫరా ప్రక్రియ నిబంధనల ప్రకారం సకాలంలో జరిగేందుకు బుకింగ్స్, డెలివరీలను కమాండ్ కంట్రోల్ ద్వారా ఆయా ఏజెన్సీలతో రోజువారీగా పరిశీలిస్తున్నారు. గత నెల రోజులుగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, మరో 70 చిన్న సిలిండర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోటి 50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 2,089 కేసులు నమోదు చేశారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపు, పంపిణీలో జాప్యంపై పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్:1967కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





