విజయవంతంగా సైబర్‌ మేధ ఏఐ

– మేడ్చల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో నిర్వహణ

మేడ్చల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: మేడ్చల్‌ పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో సైబర్‌ మేధ ఏఐ పేరుతో ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సైబర్‌ నేరాల పెరుగుదల నేపథ్యంలో సురక్షిత డిజిటల్‌ వాతావరణ నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. సుమారు 200 మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొన్న ఈ సమావేశంలో బాధ్యతాయుతమైన ఆన్‌లైన్‌ ప్రవర్తన, సైబర్‌ ముప్పుల నివారణ, ప్రజల్లో అవగాహన వ్యాప్తిపై దృష్టి సారించారు. నిపుణులు సైబర్‌ నేరాల ధోరణులు, రక్షణ చర్యలు, నైతిక డిజిటల్‌ వినియోగంపై ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్‌ స్మారక వారోత్సవం (అక్టోబర్‌ 21-30)లో భాగంగా గురునానక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సెయింట్‌ పీటర్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థులతో ఓపెన్‌ హౌస్‌ సెషన్‌ నిర్వహించారు. విద్యార్థులకు ప్రాథమిక పోలీసింగ్‌, సైబర్‌ నేరాల నివారణ పద్ధతులు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్‌ పి.మధుకర్‌ స్వామి మాట్లాడుతూ ఈ రెండు కార్యక్రమాలు యువతలో డిజిటల్‌ లిటరసీ పెంపు, పోలీసు-ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. సైబర్‌ భద్రతను సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు నిపుణురాలు ప్రమీలారుణ్‌, డి.ఎస్‌.పీ అండ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.వి.విజయ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు మంజుల, వై.వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌, కె.కిరణ్‌, ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు సమాజంలో సైబర్‌ సురక్షత, మత్తు రహిత జీవన విధానం కోసం అవగాహన పెంపు దిశగా ముందడుగుగా నిలిచాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page