– అప్రమత్తంగా ఉండాలి
– ప్రజలను హెచ్చరించిన సిపి సజ్జన్నార్
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్20: ఏపీకే ఫైల్స్, ఓటీపీ, బ్యాంక్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’బయట రాష్ట్రాల్లో ఉండి నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వేరొక స్టేట్స్ లో ఉన్న నిందితుల్ని గుర్తించడం, డబ్బును రికవరీ చేయడం కష్టంగా మారింది. ఈ సైబర్ మోసాల కారణంగా హైదరాబాద్ ప్రజలు రోజుకు కోటి రూపాయలు నష్టపోతున్నారు. అలానే సైబర్ నేరగాళ్లు రెండు విధాలుగా నేరాలకు పాల్పడుతున్నారు. ఒకటి పెట్టుబడి పేరుతో మోసం చేస్తున్నారు…. రెండోవది డిజిటల్ అరెస్ట్ తో మోసం చేస్తున్నారని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ తో ఎక్కువగా వృద్ధులు, రిటైడ్ ఉద్యోగులు మోసపోతున్నారు. ప్రజలు సైబర్ కేటుగాళ్లు, వాళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా అనుమానాస్పద కాల్స్ వస్తే 1930 కి లేదా 100 కి కాల్ చేయాలన్నారు. రాబోయే పండుగలు సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇక మధుర నగర్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు త్వరలో చర్యలు కూడా తీసుకుంటాం. మధుర నగర్ పోలీస్ స్టేషన్ ను త్వరలోనే ప్రజలకి అనువుగా అందుబాటులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం’ అని సజ్జనార్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పై కూడా సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సిట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామని సజ్జనార్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని వివరాలు సేకరిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి సిట్ కార్యాలయం విషయంలో ఆలోచన చేస్తున్నామని, ప్రస్తుతం జూబ్లీహిల్స్ పీఎస్ లోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ సాగుతుందని తెలిపారు. మరోవైపు ఐ బొమ్మ రవి కేసు గురించి అడిషనల్ సీపీ శ్రీనివాస్ పలు విషయాలను వెల్లడించారు. ’ఐ బొమ్మ రవి విచారణ జరుగుతుంది. సమాధానాలు చేప్పడంలేదని బయట ఊహాగానాలు వస్తున్నాయి. మా స్టైల్ లో మేము విచారణ చేస్తున్నాము. అతని నుండి సమాధానాలు రాబడుతున్నాం’ అని ఆయన వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.