– రూ.2.58 కోట్లు కొల్లగొట్టిన సైబర్ మోసగాళ్లు
-ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: పెట్టుబడుల పేరుతో మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు సైబర్ నేరగాళ్లు వలవేసి, దాదాపు రూ.2.58 కోట్లు కొల్లగొట్టారు.స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌లో చిట్కాలు చెబుతామంటూ తొలుత వాట్సప్ సందేశం పంపించారు. ఆమెకు అవగాహన లేకపోకవడంతో.. తన భర్త నెంబరును ఆ వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయించారు. స్టాక్స్‌లో 500శాతం లాభాలు వస్తాయని, ఇది సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అని నమ్మించారు. వాట్సప్‌లో నకిలీ సెబీ సర్టిఫికెట్లు పంపించారు. దీంతో సైబర్ నేరగాళ్ల ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వరకు మాజీ ఐపీఎస్ భార్య లావాదేవీలు నిర్వహించారు. మొత్తం 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు. ఇన్వెస్ట్‌మెంట్ ఆపడంతో మళ్లీ పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేశారు. పెట్టుబడి పెట్టకుంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని ఆమెను బెదిరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించినట్టు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





